ఎల్లారెడ్డి పట్టణంలో 2కే రన్ లో పాల్గొన్న సీఐ.. ఎస్ఐలు

0చూసినవారు
రాష్ట్ర ఏకతా దివస్ సందర్భంగా శుక్రవారం ఉదయం ఎల్లారెడ్డి పట్టణంలో 2కే రన్ నిర్వహించారు. జాతీయ ఐక్యత, సమైక్యతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అంబేద్కర్ చౌక్ నుండి ప్రారంభమై శివాజీ చౌక్ వద్ద ముగిసిన ఈ రన్ లో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్.ఐ. మహేష్, ఎస్.ఐ.-2 చారి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.