స్వచ్ఛ భారత్‌తో పరిసరాల పరిశుభ్రత: సిద్ది శ్రీధర్ గుప్తా

0చూసినవారు
స్వచ్ఛ భారత్‌తో పరిసరాల పరిశుభ్రత: సిద్ది శ్రీధర్ గుప్తా
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో స్వచ్ఛ భారత్‌తో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని 8వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మత్తమాల భాగ్యలక్ష్మి, కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్