ఎల్లారెడ్డి పట్టణ శివారులోని పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని ఎల్లారెడ్డి ఇరిగేషన్ డిఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన మినిట్యాంక్ బండ్ పరిసరాల్లో పెరిగిన కలుపు మొక్కలను, ఇరిగేషన్ శాఖ ఏఈ రాజేష్ పర్యవేక్షణలో కార్మికులతో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ, ట్యాంక్ బండ్ పరిసరాల్లో కలుపు మొక్కల పెరుగుదలను నివారించడానికి, పారిశుధ్య చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.