కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్లో కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై ఉన్న లింగంపల్లి ఖుర్దు, అడివిలింగాల హై లెవల్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి రూ. 8.50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా లింగంపల్లి ఖుర్ద్ బ్రిడ్జి వద్ద
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల
కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరాం యాదవ్ తో పాటు పలువురు
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రెండు వంతెనల నిర్మాణం అత్యవసరమని గుర్తించి, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.