జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నాయక్‌ను సత్కరించిన కలెక్టర్

0చూసినవారు
జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నాయక్‌ను సత్కరించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ లాలు నాయక్ ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందనున్న సందర్భంగా, జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో లాలు నాయక్ అంకితభావంతో విధులు నిర్వహించి పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. జేసి విక్టర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్