బదిలీపై వెళ్తున్న ఐఎఎస్ అధికారిణిని సత్కరించిన కలెక్టర్

0చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఐఎఎస్ అధికారిణిని సత్కరించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా యంత్రాంగం, డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి జ్ఞాపికతో ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, కిరణ్మయి తన నిబద్ధత, అంకితభావంతో ప్రజల మన్ననలు పొందారని, మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆమె కృషి జిల్లా అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేయడం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you