కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వల పరిస్థితిని తెలుసుకుని, రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 6.00 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు.