కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి పరిధిలోని పల్లె దవాఖాన శాబ్ధిపూర్‌లో గ్రామ ఆరోగ్య, పోషణ, పారిశుధ్య దినోత్సవం కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని, ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. షుగర్ పరీక్షల కిట్లను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ కూడా కలెక్టర్‌తో పాటు ఉన్నారు.