రేక్ పాయింట్లో యూరియా రేక్ చేరికను పరిశీలించిన కలెక్టర్

936చూసినవారు
రేక్ పాయింట్లో యూరియా రేక్ చేరికను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్, జాయింట్ కలెక్టర్ విక్టర్ తో కలిసి యూరియా రేక్ చేరికను పరిశీలించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఎరువుల సరఫరాను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ విధానం ద్వారా పంటల విస్తీర్ణానికి అవసరమైన మేరకే యూరియా అందజేయబడుతుందని, దీనివల్ల ఎరువుల సమాన పంపిణీతో పాటు అక్రమాలను అరికట్టవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్