వరి కొనుగోలు ప్రక్రియలో లోకల్ యాప్‌లో ఎంట్రీలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల పనితీరును, ముఖ్యంగా లోకల్ యాప్‌లో జరుగుతున్న ట్యాబ్ ఎంట్రీల పురోగతిని కేంద్రాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిఆర్డిఓ సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, అదనపు డిఆర్డిఓ-సెర్ఫ్ డిపిఎం, ఏపిఎంలు, సీసీలు తదితర అధికారులు పాల్గొన్నారు.