గ్రామంలో ప్లాస్టిక్ సేకరణకు నూతన విధానంపై కలెక్టర్ ప్రశంసలు

0చూసినవారు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్, తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని బుధవారం ప్రశంసించారు. కిలో ప్లాస్టిక్ సేకరించి అందజేసిన వారికి టిఫిన్ బాక్స్‌లను బహుమతిగా అందించే విధానం ప్రజల్లో మంచి స్పందన తెచ్చిపెడుతోందని, ఈ పద్ధతి ద్వారా గ్రామ ప్రజలు పెద్దఎత్తున ప్లాస్టిక్ సేకరణలో పాల్గొంటుండటం అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థుల కృషి భేష్ అని కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్