హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ

2చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 02న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీ మార్గాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం స్వయంగా పరిశీలించారు. ర్యాలీ రూట్ మ్యాప్‌ను పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు. పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గం ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ ఒకే వాహనంలో కూర్చొని క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్