బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామస్తులు స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామపంచాయతీ భవనానికి ఆనుకొని ఉన్న 0-02 గుంటల ఖాళీ స్థలాన్ని జోడు దుర్గయ్య అనే వ్యక్తి తనదని ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని, గ్రామస్తులు, పాలకవర్గం అడ్డు చెప్పినా సర్పంచి చొరవతో నిర్మాణం జరుగుతోందని, ఆ స్థలాన్ని కాపాడాలని వారు కోరారు.