కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు. ఆదివారం బడ్జెట్ పై మాట్లాడుతూ, 2026-27 సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం రూ. 3,400 కోట్లు అని, ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ. 50 కోట్లు మాత్రమే పెరిగిందని తెలిపారు. దేశ మొత్తం బడ్జెట్ రూ. 50.65 లక్షల కోట్ల నుండి రూ. 53.5 లక్షల కోట్లకు పెరిగినా, మైనారిటీలకు దక్కిన వాటా చాలా తక్కువగా ఉందని, దేశ జనాభాలో 15% ఉన్న మైనారిటీలకు ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు.