తాడ్వాయిలో కాంగ్రెస్ పాదయాత్ర

63చూసినవారు
తాడ్వాయిలో కాంగ్రెస్ పాదయాత్ర
తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సూచన మేరకు జై బాపు జైభీమ్ జైసంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ముఖ్యఅతిథిగా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుగునాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్లు హాజరయ్యారు.