అట్ట హాసంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్

13చూసినవారు
అట్ట హాసంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. శుక్రవారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ మహోత్సవానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా భారీ జనంతో హాజరయ్యారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులతో కలిసి బిచ్కుంద పార్టీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలితో నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.

ట్యాగ్స్ :