2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల ప్రచారం

2చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున రెండవ వార్డు అభ్యర్థి మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్ కోసం, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత, రామారెడ్డి శ్రీ. కాలభైరవ స్వామి ఆలయ కమిటీ చైర్మెన్ శంకర్ లు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎల్లారెడ్డి పట్టణంలో గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీలు తమ సీనియర్ నాయకులను ప్రచారానికి పిలిపించి, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్