ఎమ్మెల్యే కృషితో 8వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు

1చూసినవారు
ఎమ్మెల్యే కృషితో 8వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో రూ. 45 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు పప్పు వెంకటేశం తెలిపారు. శనివారం ఆయన రోడ్డు పనులను పరిశీలించారు. కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంపై వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యేకు అయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్