ఎల్లారెడ్డిలో ఆదుకున్న కౌన్సిలర్: బాధితులకు ఆర్థిక సాయం

1చూసినవారు
ఎల్లారెడ్డిలో ఆదుకున్న కౌన్సిలర్: బాధితులకు ఆర్థిక సాయం
ఎల్లారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో అనారోగ్యంతో మృతి చెందిన కంట్రపల్లి కిషన్ కుటుంబానికి బుధవారం కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంత్యక్రియల నిమిత్తం ఆయన ఈ సాయం అందించారు. ఇప్పటికే వార్డులో ఆడపిల్ల జననం, వివాహాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వార్డులో బాడీ రిఫ్రిజిరేటర్, రెండు బోర్లను ఏర్పాటు చేసి, తన ఎన్నికల హామీలను సిద్ధి శ్రీధర్ గుప్తా క్రమంగా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్