ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ శివారులోని మహారాజ్ ఆశ్రమంలో గల దత్తత్రేయుని ఆలయం ఈ నెల 4న దత్త జయంతి సందర్భంగా ముస్తాబవుతోంది. వ్యాపారి గోరంటి సాగర్ గుప్త ఆలయానికి రంగులు వేయించారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.