కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. విద్యా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి, కళాశాల అభ్యున్నతికి అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.