ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో ఉండేలా చూడటం బీఎల్ఏల ప్రధాన బాధ్యత అని, ఓటర్ల జాబితా పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో "సర్"పై ప్రత్యేక శిక్షణా శిబిరం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఏలు,
కాంగ్రెస్ కార్యకర్తల ప్రత్యేక శిక్షణా శిబిరానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జుక్కల్ అబ్జర్వర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు.