కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఝాన్సీ రాణి సైన్యం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో సంస్థ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'యద్భావం తద్భవతి' నినాదంతో 2018 నుండి మహిళా చైతన్యం, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న సైన్యం సభ్యులు పసుపు దుస్తులు, కాషాయ కండువాలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ, వినాయకుడు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ చిత్రాలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ 'స్త్రీ శక్తి, సమాజ శక్తి, దేశ శక్తి' నినాదంతో మహిళా శక్తిని చాటారు. ఈ శోభాయాత్ర పటేల్ చెరువు కట్ట వద్ద నిమజ్జనంతో ముగిసింది.