ఎల్లారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో రూ. 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో గంగపుత్రుల సంఘ భవనం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే మున్సిపల్ నిధులతో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా గంగపుత్రుల సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ జె. జగ్జీవన్, ఏఈ వినోద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మత్తమల ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు తిరుపతి, గఫ్ఫార్ ప్రజలు పాల్గొన్నారు.