కామారెడ్డి డివిజన్ కేంద్రంలోని చాలా పెట్రోల్ బంకులు సోమవారం సాయంత్రం వరకు మూసి ఉన్నాయి. కేవలం ఒకే ఒక బంక్ తెరచి ఉండటంతో అక్కడ వాహనాల భారీ క్యూలు ఏర్పడ్డాయి. ఎల్లారెడ్డిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీజిల్, పెట్రోల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా, బంకులు ఎందుకు మూతపడుతున్నాయో వారికే తెలియదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మూసి ఉన్న బంకులను తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడుతుందని, కానీ వారు అలా చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ అయోమయంపై పాలకులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.