ఎల్లారెడ్డి పెద్ద చెరువును మరో ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన డిజిటల్ వీడియోను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుండి విడుదల చేశారు. సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ పనులను ప్రారంభించారు.