కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టులకు మూడవ విడత అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ గురువారం జరిగింది. జాయింట్ కలెక్టర్, ఇంచార్జీ డీపీఆర్ఓ, డీఎంఎసీ కన్వీనర్ గిరి చేతుల మీదుగా పలువురు జర్నలిస్టులు ఈ కార్డులను అందుకున్నారు. మొదటి, రెండు విడతల్లో దాదాపు 500కు పైగా కార్డులు అందించామని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఎసీ సభ్యుడు వి. రాజేందర్ నాథ్ కూడా పాల్గొన్నారు.