బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్లో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం నియోజకవర్గంలో 341 మంది లబ్ధిదారులకు లక్ష పది లక్షల ఐదు వేల ఐదు వందల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.