సంక్షేమ పథకాల పంపిణీ: అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి

1చూసినవారు
సంక్షేమ పథకాల పంపిణీ: అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి
రామారెడ్డి మండలం, కన్నాపూర్ తండా గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆదేశాల మేరకు, సర్పంచ్ మంగి గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలిచి, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్