ఎమ్మెల్యేకు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల వినతి

6చూసినవారు
ఎమ్మెల్యేకు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల వినతి
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రామారెడ్డి మండల పర్యటనలో సోమవారం జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఐక్య వేదిక ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులైన తమను రెగ్యులరైజ్ చేయాలని, 100% గ్రాస్ సాలరీ, పెండింగ్ వేతనాల విడుదల, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్ పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్