కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా టెన్త్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య జరుగుతున్నాయి. శనివారం జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జీవధాన్ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. 163బీ ఎన్ ఎస్(144) సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు.