పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ

7చూసినవారు
పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర బుధవారం పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పోలీస్ సిబ్బందితో మాట్లాడి, రోల్ కాల్ ప్రాముఖ్యతను, వారి విధులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఆర్థిక నేరాలు, దొంగతనాలపై సమీక్ష నిర్వహించి, నేరాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ గస్తీని పెంచాలని ఎస్ఐకి ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :