హామీలను అమలు చేయలేకనే డైవర్షన్ పాలిటిక్స: మాజీ ఎమ్మెల్యే

0చూసినవారు
హామీలను అమలు చేయలేకనే డైవర్షన్ పాలిటిక్స: మాజీ ఎమ్మెల్యే
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి, నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్లారెడ్డిలో సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి దాఫెదార్ రాజు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, సీఎం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్