కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందించిన వైద్యుడు

4చూసినవారు
కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందించిన వైద్యుడు
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ బి. నాగేశ్వర రావు, గురువారం రాత్రి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తన ప్రథమ కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య వివాహం ఈ నెల 20న జరగనున్న సందర్భంగా, వివాహ మహోత్సవ శుభలేఖను ఎమ్మెల్యేకు అందజేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వైద్యునికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల నూతన బస్ స్టాండ్లో దాదాపు 6 లక్షల వ్యయంతో లేటెస్ట్ ఫర్నిచర్ ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్ననలు పొందిన వైద్యుడి సామాజిక కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్