ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్తు ప్రక్రియలో భాగంగా, 3వ దశలో మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన
విద్యార్థులు ఈనెల 26 నుంచి జూలై 2 లోపు కళాశాలలో రిపోర్టు చేసి సీటును నిర్ధారించుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దోస్త్ ప్రక్రియలో మొదటి, రెండవ, మూడవ దశల్లో సీటు పొంది, సెల్ఫ్ రిపోర్టు చేసిన
విద్యార్థులు, తమ సర్టిఫికెట్లతో ఈనెల 27 నుంచి జూలై 4 లోపు కళాశాలకు వచ్చి తమ అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.