హైదరాబాదులో బుధవారం జరిగిన డాక్టర్స్ డే అవార్డుల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ పల్స హరీష్ గౌడ్ కు 'జీవన్ రక్షక్' అవార్డును మాజీ మంత్రి డాక్టర్ బాబు మోహన్ చేతుల మీదుగా అందజేశారు. పీపుల్ మీడియా పాయింట్ డాక్టర్ హరీష్ గౌడ్ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించి ఈ పురస్కారం ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 50 మంది వైద్యులను ఎంపిక చేయగా, ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందని, ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ హరీష్ గౌడ్ పేర్కొన్నారు.