ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు గండిమసానిపేట్ లో మూతపడిన పాల శీతలీకరణ కేంద్రాన్ని బుధవారం డీఆర్డీఓ సురేందర్ పరిశీలించారు. మహిళా శక్తిలో భాగంగా ఎల్లారెడ్డి మండల సమాఖ్య ద్వారా ఈ కేంద్రాన్ని తిరిగి నడపడానికి గల అవకాశాలను ఆయన పరిశీలించారు. పాల ఉత్పత్తిదారులకు ఎక్కువ లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు, లబ్ధిదారులకు పాడి గేదెల కొనుగోలుకు సంబంధించిన సాధ్యసాధ్యాలను కూడా పరిశీలించినట్లు తెలిపారు.