ఎకో టూరిజం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్

3చూసినవారు
ఎకో టూరిజం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్, నిజాంసాగర్ సమీపంలో రూ. 9.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎకో టూరిజం ప్రాజెక్టు పనులను గురువారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న కాటేజీలు, లగ్జరీ సూట్లు, డీలక్స్ గదులను ఆయన తనిఖీ చేశారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ డిప్యూటీ ఇంజనీర్, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 7 డీలక్స్ గదులు, 10 సూట్ల నిర్మాణం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్