హైదరాబాద్–మెదక్–బోధన్ (హెచ్‌ఎంబీ) రాష్ట్ర రహదారి జాతీయ రహదారిగా మారిన నేపథ్యంలో చేపట్టిన విస్తరణ పనులు కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో జోరందుకున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య పనుల్లో జాప్యం, పట్టణంలోనూ పనులు నెమ్మదించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంట్రాక్టర్, జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ చొరవతో పనుల వేగం పెరిగింది.