కూలిపోయే స్థితిలో ఎల్లారెడ్డి నూతన బస్స్టాండ్ ప్రహరీ గోడలు
ఎల్లారెడ్డిలో నూతనంగా నిర్మించిన బస్స్టాండ్ ప్రహరీ గోడలు నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల ఆందోళనకరంగా నెర్రలు బారుతున్నాయి. మున్సిపల్ నిధులు మరియు ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ద్వారా మంజూరైన నిధులతో ఈ నిర్మాణం చేపట్టారు. కాగా, బస్స్టాండ్ ఆవరణలో వాహనాల పార్కింగ్తో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని బుధవారం డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపంపై విచారణ జరిపి, పార్కింగ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు, డ్రైవర్లు అధికారులను కోరుతున్నారు.