కామారెడ్డి జిల్లా సహకార అధికారి తెలిపిన వివరాల ప్రకారం, కోరం లేకపోవడంతో ఎల్లారెడ్డి సొసైటీ మహాజన సభ వాయిదా పడింది. సొసైటీ మహాజన సభను తిరిగి నిర్వహించడానికి కలెక్టర్‌ను కోరడం జరిగిందని ఆయన తెలిపారు. రైతు సమస్యలు, సభ్యుల సమస్యలు, వరి ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై చర్చించడానికి సభ్యులు తీర్మానం చేశారని సొసైటీ సభ్యులు వెల్లడించారు.