కామారెడ్డి జిల్లా కుప్రియల్ లోని మహాత్మ గాంధీ జ్యోతిబా ఫూలే పాఠశాలలో గురువారం రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు ఇర్షాద్, కృష్ణ తేజ, రఫీ విద్యార్థులకు రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరించారు. పాదచారులుగా, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరళమైన భాషలో తెలియజేసి, రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.