సోమవారం ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ జలిలోద్దిన్, నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లి, జలాల్పూర్ గ్రామాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తు దిశగా సాగాలని, వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని, డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.