ఎల్లారెడ్డిలో విస్తృతంగా వాహనాల తనిఖీ

1చూసినవారు
ఎల్లారెడ్డిలో విస్తృతంగా వాహనాల తనిఖీ
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిలో పోలీసులు సోమవారం విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను ఆపి, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను పరిశీలించారు. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి వెంటనే చెల్లించాలని, టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలువురు వాహనదారులకు జరిమానాలు విధించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్