పోడు భూముల సమస్య: గిరిజనులు తహసీల్దార్‌కు వినతి

3చూసినవారు
పోడు భూముల సమస్య: గిరిజనులు తహసీల్దార్‌కు వినతి
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ తండాకు చెందిన సుమారు 50 గిరిజన కుటుంబాలు తమ పోడు భూముల సమస్య పరిష్కరించాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 18/1లోని భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా జాయింట్ సర్వే నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ వారు వినతి అందించారు.

సంబంధిత పోస్ట్