ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో సోమవారం ఉదయం నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన రైతు మంద కృష్ణయ్య అయ్యప్పకు అభిషేకాలు చేయించారు. ఆలయ పూజారి శ్రీనివాస్ రావు ఈ అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలు పూర్తయ్యాక 18 మెట్లపై కర్పూర జ్యోతులు వెలిగించి, అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాలధారణ వేసిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.