రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దు... ఎమ్మెల్యే మదన్ మోహన్

2చూసినవారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, సోమవారం లింగంపేట మండలంలో పర్యటించి, వర్షాల వల్ల తడిసిన ధాన్యం గురించి మహిళా రైతులతో మాట్లాడారు. రైతులు అధైర్యపడొద్దని, తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ రైతుల వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్