కామారెడ్డి సెగ్మెంట్ పరిధిలోని బిక్కనూరు మండలం జంగంపల్లి సొసైటీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం నుండి ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఎరువులు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్న రైతులకు సొసైటీ ఉద్యోగి వంశీ భరోసా ఇచ్చారు. రైతులకు సరిపడే ఎరువుల నిల్వలు ఉన్నాయని, ప్రతి రైతుకు ఎరువులు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు తొందరపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.