బిడ్డలను డ్యామ్లో తోసి తండ్రి ఆత్మహత్య

0చూసినవారు
బిడ్డలను డ్యామ్లో తోసి తండ్రి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలానికి చెందిన బోయి కృష్ణ (34) తన ఇద్దరు పిల్లలు రక్షిత్ (9) మరియు అనన్య (5) లను నిజాంసాగర్ ప్రాజెక్టులో తోసివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య కథనం మేరకు ఈ వివరాలు వెల్లడయ్యాయి. కృష్ణ తన భార్య పిల్లలతో కలిసి గత 3 నెలలుగా పఠాన్ చెరులో నివాసం ఉంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్