కామారెడ్డి కలెక్టరేట్ పార్కింగులో అగ్నిప్రమాదం

597చూసినవారు
కామారెడ్డి కలెక్టరేట్ పార్కింగులో అగ్నిప్రమాదం
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం పార్కింగ్‌లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు ఫైర్ ఇంజన్‌తో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించకపోతే పెను ప్రమాదం సంభవించేదని, పక్కనే ఉన్న కార్లు కూడా కాలిపోయే అవకాశం ఉందని అక్కడివారు తెలిపారు. అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగులకు తెలియజేయడంతో కార్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్